AP Home Minister Anitha on Vamsi vallabhaneni: వల్లభనేని వంశీ అరెస్ట్ పై ఏపీ హోం మంత్రి అనిత కీలక ప్రకటన చేశారు. వంశీ అరెస్ట్ విషయంలో కర్మ సిద్ధాంతం కనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీ అపోయింట్మెంట్ ఇవ్వలేదని వైసీపీ నేతలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. నిన్న డీజీపీ బిజీ గా ఉండచ్చు.

అయిన ఎన్ని సార్లు ఈ 8 నెలల్లో వైసిపి నేతలు డిజిపి ని కలవలేదు…చెప్పాలని చురకలు అంటించారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం కాదు… సక్రమమే..అన్ని ఆధారాలు ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కేసులు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ హోం మంత్రి అనిత.