తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన, కులాల వర్గీకరణపై నేడు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మ.2 గంటలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఇందులో సీఎం రేవంత్‌రెడ్డి,రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ సైతం హాజరు కానున్నారు.ఇప్పటికే కులగణన, వర్గీకరణ మీద ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ క్రమంలో కులగణనలో పాల్గొనని వారి కోసం మరోసారి రీ సర్వే నిర్వహిస్తున్నారు. దీనికి తోడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి పీపీపీ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.