ఇప్పటికే కరోనా విషయంలో అత్యంత బెంబేలెత్తిన వారిలో ప్రథమస్థానం కోసం పోటీపడుతున్న చంద్రబాబు ఆరోగ్యం గురించి టెన్షన్ ఫీలవుతున్నారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు! బాబు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని.. ఎక్కువగా ఆందోళన చెందవద్దని.. మరింతగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని తనదైన శైలిలో సూచించారు!
అవును… కరోనా సమస్యలపై తమ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని చంద్రబాబు కోరడంపై ఏపీ మంత్రి కన్నబాబు చంద్రబాబుపై సెటైర్లు వేశారు! చంద్రబాబు ఇంకా తాను ముఖ్యమంత్రిలా భ్రమల్లో ఉన్నారని మొదలుపెట్టిన కన్నబాబు… కరోనా నియంత్రణ చర్యల్లో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్ధానంలో ఉందని.. చక్కటి పరిపాలనతో సీఎం జగన్ కరోనాను ఎదుర్కోంటున్నారని.. ఈ విషయంలో బాబుకు టెన్షన్ అవసరం లేదని తెలిపారు!
ఇక చంద్రబాబు కరోనా సమస్యలపై ఫిర్యాదులు చేయడంటూ ఏర్పాటుచేసిన వెబ్ సైట్ పై కూడా కన్నబాబు సెటైర్లు వేశారు! ఇంతకాలం కరోనాకు బయపడి రాష్ట్రాన్ని విడిచి దూరంగా బ్రతుకుతున్న చంద్రబాబు… ఇప్పుడొచ్చి కరోనా సమస్యలపై తమ వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయాలని కోరడం హాస్యాస్పదమని అన్నారు! కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు హైదరాబాద్ లో ఉండి గుమ్మం దాటి బయటకు రాలేదని ఎద్దేవా చేశారు!
అనంతరం… పరిపాలన కోసం సీఎం జగన్ కి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబుతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు కన్న బాబు! ప్రజల కోసం జగన్ ఉన్నారు.. బాబు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఎక్కువ ఆందోళన చెందితే ఆరోగ్యానికి ఇబ్బందులు రావొచ్చు.. కరోనా తగ్గే వరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిది అని చంద్రబాబుకు సూచించారు కన్నబాబు! మరి కన్నబాబు మాటలు బాబు వింటారో లేదో వేచి చూడాలి!!
-CH Raja