ఏపీ హై కోర్టులో మంత్రి కొల్లు రవీంద్ర కు ఊరట లభించింది. ఈ నెల 20న కొల్లు రవీంద్ర విదేశాలకి వెళుతూ ఉండడంతో పాస్ పోర్ట్ ప్రక్రియ వెంటనే క్లియర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.
క్రిమినల్ కేసులకు సంబంధం లేకుండా మంత్రి కొల్లు రవీంద్ర కు పాస్ పోర్ట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇక మంత్రి కొల్లు రవీంద్ర కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హై కోర్టు.