వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే జిల్లాలో కడప తర్వాత నెల్లూరు, చిత్తూరు జిల్లాలు ఉంటాయి.. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాలో ప్యాన్ పార్టీ వన్ సైడ్ పలితాలను రాబట్టింది.. టీడీపీ భూస్థాపితం అయిపోందని అందరూ భావించారు.. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి పార్టీలు రాష్టంలో సునామీ సృష్టించాయి.. చిత్తూరు, కడపలోనే ఒకటి, రెండూ సీట్లు దక్కగా.. నెల్లూరులో ఘోరంగా ఓడిపోయింది.. ఈ క్రమంలో ఆ జిల్లాలో వైసీపీ అధినేత జగన్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది..
పార్టీని నడిపించగలిగే సమర్దత కల్గిన నేతలను జిల్లా అధ్యక్షులుగా చెయ్యాలని జగన్ భావిస్తున్నారు..అందులో భాగంగా మాజీ మంత్రులకు అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తున్నారు.. మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గ నేతలతో సత్సంబంధాలు, పార్టీ క్యాడర్ తో పరిచయాలు.. ప్రస్తుతం పార్టీ బలోపేతానికి కలిసి వస్తాయని జగన్ ఆలోచనట..అందుకోసమే.. మాజీలకు బాధ్యతలను ఇవ్వాలని నిర్ణయించారు.. అందులో భాగంగా ఉమ్మడి చిత్తూరు, నెల్లూరుజిల్లాల అధ్యక్షులుగా పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్దన్ రెడ్డులను ఖరారు చేసినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి..
నెల్లూరుజిల్లా వైసీపీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు..ఆయన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కావడంతో ఆయన పదవికి న్యాయం చెయ్యలేకపోతున్నారనే ప్రచారం జరుగుతోంది.. ఈ క్రమంలో కాకాణికి బాధ్యతలు అప్పగించబోతున్నారు.. పార్టీ ఓటమి తర్వాత నేతలందరూ సైలెంట్ అయితే రాష్టంలో కాకాణి మాత్రమే చంద్రబాబు,లోకేష్ మీద విమర్శలు చేస్తూ క్యాడర్ కు అండగా ఉంటున్నారు.. దీంతో ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని జగన్ భావిస్తున్నారట.. నెల్లూరుజిల్లాలో పార్టీనిబలోపేతం చెయ్యాలంటే కాకాణి అనుభవం పనికొస్తుందని.. అందుకే ఆయన వైపు జగన్ మొగ్గుచూపారని పార్టీలో చర్చ నడుస్తోంది..
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి విముఖత చూపారని, పార్టీ అవసరాల దృష్ట్యా ఒప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మొత్తంగా వైసీపీ అధినేత జగన్.. ఒక్కో జిల్లాను సెట్ చేసుకుంటూ.. పార్టీని బలోపేతం చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది..