కొణిదెల పవన్ కల్యాణ్ అను నేను.. డిప్యూటీ సీఎంగా జనసేనాని ప్రమాణం

-

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయతో ప్రమాణం చేయించారు. పవన్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రాంగణంలోని వారంతా లేచి చప్పట్లతో అభినందించారు. ఆయన అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోదీ, గవర్నర్‌తో పాటు సీఎం చంద్రబాబుకు పవన్‌ ధన్యవాదాలు తెలిపారు. చిరంజీవి పవన్​ను ఆనందంతో గుండెలకు హత్తుకున్నారు.

అంతకుముందు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్‌ గడ్కరీ, రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాసవాన్‌తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్‌ దంపతులు, రామ్‌చరణ్‌ తదితరులు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news