చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఈటల

-

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఈటల రాజేందర్ హాజరు అయ్యారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనకు అమరావతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, నారా రోహిత్, శివాజీ, నందమూరి సుహాసినితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. దాదాపుగా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరవుతున్నారు. ఈ కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో జాతీయ రహదారిపై టోల్‌గేట్ వద్ద రాయలసీమ నుంచి వస్తున్న వాహనాలతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news