BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

-

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో భాగంగా బిపి చెక్ చేసుకున్నారు ఏపీ మంత్రి రోజా. పరీక్షల్లో బీపి ఎక్కువ గా ఉందని రెస్ట్ తీసుకొవాలని మంత్రి రోజాకు సూచించారు వైద్యురాలు.

AP Minister Roja is seriously ill

ఇక ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ…. జగనన్న ఆరోగ్య సురక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట శ్రీరామరక్ష అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ఘనత సిఎం జగన్ దని కొనియాడారు. అయితే.. పరీక్షల్లో బీపి ఎక్కువ కావడంపై రోజా కాస్త ఆందోళనకు గురయ్యారు.

కాగా, తనపై బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థించడం సరికాదని మంత్రి రోజా అన్నారు. ‘లోకేశ్తో పాటు ఇతర టీడీపీ నేతలు సత్య నారాయణ అరెస్ట్ను ఖండించారు. వారి తల్లులు, భార్యలు, కూతుళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురైతే ఇలాగే చేస్తారా’ అంటూ రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version