బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

-

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి జోష్ లో కనిపిస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ ఈసారి అధికారం కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 

తెలంగాణలో మొన్న పాలమూరు సభలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ప్రకటించిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే.  తెలంగాణ లో “సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం”, “జాతీయ పసుపు బోర్డు” లకు కేంద్ర కాబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు అధికారికంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది.  కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం లో వెల్లడించనున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version