దక్షిణాఫ్రికాలో మాదిరిగా మూడు రాజధానుల విధానాన్ని అనుసరించాలని చూసిన జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నార్త్ ఆఫ్రికా విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణ రాజు ఫైర్ అయ్యారు. ఆయిల్ నిక్షేపాలతో కూడుకున్న లిబియాను గడాఫీ అనే నియంత 40 ఏళ్ల పాటు పాలించారని, ఆయన విధానాలు నచ్చని ప్రజలు అతనిని కొట్టి చంపేశారని, గడాఫీ ఎప్పుడూ తన చుట్టూ మహిళలను రక్షణ కవచంగా పెట్టుకునేవారని, ఇప్పుడు జమోరె కూడా మహిళలను రక్షణ వలయంగా వాడుకోవాలని నిర్ణయించారని అన్నారు. ఇందుకు గాను ఓ 60 మంది మహిళలకు శిక్షణ కూడా ఇచ్చారని, మహిళలు దాడి చేస్తారని నిఘా వర్గాల నివేదిక ఆధారంగా, మహిళలను రక్షణ వలయంగా వాడుకోవాలని జమోరె భావిస్తున్నారని, ఆల్రెడీ పురుషులు దాడి చేస్తారని పరదాలను కట్టుకు తిరుగుతున్న జమోరె, చెట్లపై నుండి ఎవరైనా దాడి చేస్తారని వాటిని నరికించి వేస్తున్నారని మండిపడ్డారు.
మహిళల నుంచి కూడా రక్షణ లేదని భావిస్తున్నా ఆయన ఇంకా ప్రజా జీవితంలో ఉండడం ఎందుకు?!. మహిళలంటే భయం, చెట్లు అంటే భయం, చివరకు మనుషులంటే కూడా జమోరె కు భయమని రఘురామకృష్ణ రాజు గారు ఎద్దేవా చేశారు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఎవరు కూడా ఇంతగా ప్రజలకు భయపడిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో లేవని, తాను తన సొంత నియోజకవర్గానికి వస్తానంటే కేసులు పెట్టి వేధిస్తున్నారని, ప్రభుత్వ అధినేత మాత్రం ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతున్నారని, ఇప్పుడు మహిళలంటే భయపడుతున్న జమోరె, రేపు పిల్లలు కూడా దాడి చేస్తారని, చిన్నపిల్లలను కూడా రక్షణ వలయంగా పెట్టుకుంటారేమోనని అపహాస్యం చేశారు. ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లడానికి భయపడుతుంటే యువ గళం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు, వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి నిర్భయంగా వెళుతున్నారని అన్నారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు వారికి బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో 51% ఓటు బ్యాంకు కలిగిన మహిళలు దాడి చేస్తారని, మహిళా బౌన్సర్ల రక్షణ వలయంలో సంచరించాలని భావిస్తున్న జమోరె, సభ్య సమాజానికి ఇస్తున్న సందేశం ఏమిటి?! అని ప్రశ్నించారు. గడాఫీ విధానాలను అనుసరించడం ద్వారా పార్టీకి మహిళా ఓటర్లను దూరం చేయవద్దని రఘురామకృష్ణ రాజు గారు సూచించారు.