ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉన్న సముద్రంలో వాయుగుండం ప్రభావం స్పష్టంగా ఉంది. వాయుగుండం ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇవాళ కూడా… ఏపీలోని చాలా జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ముఖ్యంగా సత్య సాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, వైయస్సార్, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తీరం దాటే సమయంలో 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తాయని కూడా హెచ్చరించింది. కాబట్టి మత్స్యకారులు వేటలకు వెళ్లకూడదని కూడా సూచించింది. అటు చెన్నైలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి.