పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు

-

CM jagan : పట్టాదార్ పాస్ పుస్తకాలపై ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. వివిధ కారణాలతో అనర్హులకు మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

AP Sarkar key pass orders on Pattadar books

తమ భూములు కాకపోయినా వాటిపై పాస్ పుస్తకాలు పొంది రుణాలు, సబ్సిడీలు పొందుతున్న వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలని సూచించారు. అనర్హులని తేలితే వాటిని రద్దుచేసి, అర్హులైన భూ యజమానులకు ఇవ్వాలని స్పష్టం చేశారు.

ఇది ఇలా ఉండగా, ఏపీ విద్యార్థులకు, ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. ఈ నెలలో సంక్షేమ పండుగ కొనసాగనుంది. ఈ నెల 19 నుంచి జనవరి 29 వరకు వరుస పథకాలు అమలు చేయనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌. 19న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందించనుంది జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version