ఈనాడుకు ఏపీ సర్కార్ లేఖ చేసింది. అయితే.. దీనిపై రఘురామ స్పందించారు. ఈనాడు దినపత్రికకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బెదిరింపు లేఖ రాయడం విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, టీడీపీ నాయకులు రఘురామకృష్ణ రాజు విమర్శించారు. మీకు బాధ్యత లేదా?, ఎన్నికల సంఘం అంటే గౌరవం లేదా??, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటో తెలుసునా??? అని ఈనాడు దినపత్రికకు రాసిన బెదిరింపు లేఖలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారన్నారు.

తాము తయారు చేసిన అధికారుల జాబితా నచ్చకపోతే, మళ్లీ మరొక జాబితాను రూపొందించాలని ఎన్నికల సంఘం ఆదేశిస్తే, రూపొందించి పంపుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారన్నారు. అసలు అధికారుల జాబితాను రూపొందించి పంపాల్సిన అవసరం మీకేంటని?, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారిని ఉద్దేశించి రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సీనియర్ అధికారుల జాబితాను అందజేస్తే సరిపోతుంది కదా అంటూ నిలదీశారు. ఎన్నికల సంఘం అధికారులే సొంతంగా ఒక సర్వేను చేయించుకొని ఎవర్ని ఎక్కడ నియమించాలో అక్కడ నియమిస్తారన్నారు.