నీట్-2023లో శ్రీకాకుళం కుర్రాడికి ఫస్ట్ ర్యాంక్

-

నీట్‌ యూజీ-2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి ఆల్‌ ఇండియా ఫస్ట్‌ ర్యాంకులో మెరిసి సత్తా చాటాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోర వరుణ్‌ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన ప్రభంజన్‌ 99.99 పర్సంటైల్‌ సాధించి తొలి ర్యాంకు సాధించినట్టు ఎన్‌టీఏ వెల్లడించింది. నీట్​కు అర్హత సాధించిన వారిలో యూపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నట్టు తెలిపింది.

మంగళవారం రాత్రి నీట్‌ యూజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. జాతీయ టెస్టింగ్‌ ఏజెన్సీ మే 7న దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 20,38,596 మంది హాజరయ్యారు. హాజరైన అభ్యర్థుల్లో 11,45,976 మంది (56.12%) అర్హత సాధించారు. తెలంగాణ నుంచి పరీక్ష రాసిన 72,842 మందిలో 42,654 (58.55%), ఏపీ నుంచి హాజరైన 68,578 మందిలో 42,836 (62.46%) మంది అర్హత సాధించారు. టాప్‌-50 ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు ఏడుగురు ఉండగా, వారిలో అయిదుగురు ఆంధ్రప్రదేశ్‌ వారే.

Read more RELATED
Recommended to you

Exit mobile version