ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ దస్పల్లా భూములు, క్రిష్టియన్ భూములలో జరిగిన అవకతవకలను బయటికి తీస్తామని హెచ్చరించారు పల్లా శ్రీనివాసరావు. అప్పటి అధికార పార్టీ భూ కబ్జాలపై విచారణ చేపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈవీఎం ధ్వంసం చేసిన క్రిమినల్ ని జగన్ కలవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహించారు పల్లా శ్రీనివాసరావు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర జగనుదన్నారు.
బాబాయ్ తెల్లవారు జామున 5 గంటలకు చనిపోతే సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళాడు…. జైల్లో ఉన్న పిన్నెల్లిని కలవడానికి మాత్రం చార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి పరామర్శించాడని నిప్పులు చెరిగారు పల్లా శ్రీనివాసరావు. జగన్ వ్యవహార శైలి చూశాక ఇక మారడు అని ప్రజలకు అర్థమైందని వెల్లడించారు. మా ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్టు జగన్ గగ్గోలు పెడుతున్నాడు….జగన్ ఇలాగే వ్యవహరిస్తే త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. 2029 లో కూడా మాదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు.