త్వరలోనే 1400 కొత్త బస్సులు రాబోతున్నాయని ప్రకటించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. ఇవాళ మీడియాతో ఏపీ రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… కేంద్రం సహాయంతో ఐదేళ్లలో RTC లో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశ పెడతామన్నారు. త్వరలోనే 1400 కొత్త బస్సులు రాబోతున్నాయని చెప్పారు. APSRTC నీ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది అన్నారు.
కార్పొరేషన్ ఆస్తులను సద్వినియోగం చేసి ఆర్టీసీని లాభదాయకంగా మారుస్తామని ప్రకటించారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. గత ప్రభుత్వంలో మాదిరిగా లాభ దాయకంగా లేదని ఆర్టీసీని పక్కన బెట్టే చేతకాని ప్రభుత్వం మాది కాదన్నారు. లాభదాయకంగా లేదని బస్సులు రద్దు చేసే పరిస్థితులు వుండవోద్దని వెల్లడించారు. కార్మికులు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు ఏపీ రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి. మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు ప్రవేశ పెట్టేనాటికి పూర్తిస్థాయిలో బస్సులు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.