దేశంలో నూతన చట్టాల కింద కేసుల నమోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి కేస్ అయింది. అది కూడా చార్మినార్ పీఎస్ లో కేసు నమోదు అయింది. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వ్యక్తి పై కేస్ నమోదు చేశారు చార్మినార్ పోలీసులు. కొత్త చట్టాల ప్రకారం ఎఫ్ ఐ ఆర్ ను డిజిటల్ గా నమోదు చేశారు పోలీసులు. గంట లో వివిధ పోలీస్ స్టేషన్ లలో 3 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు అయ్యాయి.
అటు న్యూదిల్లీ రైల్వే స్టేషన్ పరిధిలోని ఓ వీధి వ్యాపారిపై కొత్త క్రిమినల్ కోడ్‌లోని సెక్షన్ 285 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎన్‌డీఆర్‌ఎస్ సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కింద రోడ్డుపై వాటర్ బాటిళ్లు, గుట్కా, బీడీ, సిగరెట్లు అమ్మడాన్ని గుర్తించిన పెట్రోలింగ్ పోలీసులు దానివల్ల రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఆ వ్యాపారిని తన బండిని వేరే చోటుకు తరలించమని గతంలో పలుమార్లు చెప్పారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో అతడి వ్యాపారం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను వీడియో తీసి, కేసు నమోదు చేసినట్లు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఆ వీధి వ్యాపారిని బిహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.