కొత్త వాహనం కొనుగోలు చేసేవారికి ఏపీ రవాణాశాఖ కీలక సూచనలు

-

కొత్త వాహనం కొనుగోలు చేసే వారికి ఏపీ రవాణా శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఆధార్ కు అనుసంధానం చేసిన ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాల్సిందేనని తెలిపింది. ఆ నెంబర్ కు వచ్చే వన్ టైం పాస్వర్డ్( ఓటిపి) నమోదు చేస్తేనే వాహన రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గతంలో మాదిరిగా వేలిముద్రలతో రిజిస్ట్రేషన్ జరుగుతుందనుకుంటే సాధ్యం కాదు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ.. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది.

అనేక రాష్ట్రాలు రవాణా శాఖకు చెందిన సేవలు అన్నింటిని వాహన్, సారధి పోర్టల్ ద్వారానే అందిస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్ మాత్రమే సొంత పోర్టల్లు నిర్వహిస్తున్నాయి. కొద్ది నెలల కింద ఏపీ రవాణాశాఖ కూడా వాహన్, సారథి సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గత వారం నుంచి వాహన్ పోర్టల్ ద్వారానే కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించారు.

గతంలో ఆధార్ కు ఫోన్ నెంబరు అనుసంధానం లేకపోతే వేలిముద్రల ద్వారా తీసుకుని రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలు ఉండేది. కానీ వాహన్ లో ఈ అవకాశం లేదు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ లు అన్ని వాహన్ పోర్టల్ ద్వారానే జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news