సీఎం రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఏపీ యువకుడు డబ్బులు దండుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ అంటూ డబ్బులు డిమాండ్ చేసాడు. ఈ తరుణంలోనే ఏపీ యువకుడు అరెస్ట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిని, ఓఎస్డీని అంటూ డబ్బులు కావాలంటూ మెయిల్స్ పంపాడు శ్రీకాకుళం జిల్లా నర్సన్న పేటకు చెందిన నాగరాజు(32).
రేవంత్ రెడ్డి ఓఎస్డీని.. డబ్బులు చెల్లించాలి అంటూ జీమెయిల్స్, వాట్సాప్ మెసేజెస్ పంపించాడు. బొల్లినేని ఇన్ ప్రా ప్రాజెక్ట్స్ ఎండీ శ్రీకృష్ణ మోహన్ బొల్లినేని, ర్యాపిడో ఎండీ అరవింద్ సంకా, గుప్తా రియాలిటీ ఛైర్మన్ శ్రీనివాస్ గుప్తా వెర్రబొమ్మ, కంట్రీడిలైట్ ఎండీ చక్రధర్, నితిన్ కౌశల్‌తో పాటు ఎంతో మందికి మెయిల్స్ చేసాడు నాగరాజు. అయితే ఇందులో కొంతమంది డబ్బులు ఇచ్చినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సాంకేతిక ఆధారాలతో ఏపీలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు సైబర్ క్రైమ్ పోలీసులు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.