కరోనా మహమ్మారి కేసులు మళ్లీ నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా కనీసం రోజుకు 200 నుంచి 300 కేసులు నమోదు అవుతున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ నటి కి.. కరోనా మహమ్మారి సోకింది.

జువెల్ తీఫ్ ఫేమ్ నికితా దత్తా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘నాకు, మా అమ్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయినా ఇది మాతో ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కొద్ది రోజుల క్వారంటైన్‌తో మేము ఆరోగ్యంగా బయటకు వస్తాము.’ అంటూ నికితా దత్తా పేర్కొంది. కాగా, ఈ నెలలో మహరాష్ట్రలో 95 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.