తిరుమల శ్రీవారి భక్తులకు.. బిగ్ అలర్ట్. ఇవాళ తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించిన టికెట్లు విడుదల కానున్నాయి. తిరుమల శ్రీవారి పలు సేవలకు సంబంధించి ఆగస్టు నెల టికెట్లను ఇవాళ టిటిడి పాలకమండలి రిలీజ్ చేయనుంది. ఉదయం 10 గంటల సమయంలో అంగాప్రదక్షిణ టోకెన్లు అందించబోతోంది టిటిడి పాలకమండలి.

ఇక ఇవాళ 11 గంటల సమయంలో శ్రీవాణి ట్రస్టు టికెట్లు ఆన్లైన్ లో విడుదల కానున్నాయి. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా.. చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వాళ్లందరికీ వీలుగా ఉచిత ప్రవేశ దర్శనం కూడా టికెట్లు రిలీజ్ కానున్నాయి. అధికారిక వెబ్సైట్లోనే ఈ టికెట్లు తీసుకోవాలని టీటీడీ పాలక మండలి స్పష్టం చేసింది.