ఏపీలో 3500 మంది ఆర్టీసీ డ్రైవర్ల నియామకం ?

-

ఏపీలో అదనంగా 2 వేల బస్సులు, 3500 మంది డ్రైవర్ల నియామకంపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగానే… ఇవాళ వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. హోం శాఖ, రవాణ, రవాణ, యువజన సర్వీసుల శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఏపీలోని శాంతి భద్రతలు, మహిళల రక్షణపై చర్చ ఉంటుంది. ఆస్పత్రుల్లో గొడవలు జరగ్గకుండా తీసుకోవాల్సిన ప్రత్యేక భద్రతపై సమీక్ష ఉంటుందని సమాచారం.

Appointment of 3500 RTC drivers in AP

గంజాయి నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రస్తావన ఉంటుందట. ఏపీ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్-AP ANTF బలోపేతంపై చర్చ జరుగనుంది. ఇసుక పాలసీ అమలుపై సమీక్ష ఉంటుంది. రవాణ శాఖ పైనా సీఎం చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. అదనంగా 2 వేల బస్సులు, 3500 మంది డ్రైవర్ల నియామకంపై చర్చ ఉంటుందట. రాష్ట్రాల సరిహద్దుల్లో రవాణ శాఖ చెక్ పోస్టుల ఏర్పాటు చేయాలా..? వద్దా..? అనే అంశంపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version