టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని క్షేత్రస్థాయిలో ప్రజలలోకి తీసుకువెళ్లాలని, అలాగే రానున్న ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలనే సంకల్పంతో శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడంలేదని టిడిపి భావిస్తుంది.

అయితే ప్రజల నుంచి సానుభూతిని రాబట్టుకునేందుకు, ఈ సానుభూతిని కాపాడుకుని వ్యూహత్మకంగా అడుగులు వేస్తే భవిష్యత్తులో అధికారంలోకి రావచ్చని టిడిపి భావిస్తుంది. మరోవైపు ఇప్పటికే జనసేన – టిడిపి వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది.

టిడిపి అధినేత నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ పార్టీ పొలిటికల్ యాక్షన్ కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంఐ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్ధన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర, నారా లోకేష్ లకు స్థానం కల్పించింది.

Read more RELATED
Recommended to you

Latest news