ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపింది జగన్ సర్కార్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు నిర్దేశించిన గడువు జూన్ 10 కాగా… కొన్ని జిల్లాల్లో పరిపాలనపరమైన కారణాలతో జులై 31 వరకు బదిలీలు జరిగాయి. అయితే గడువు తర్వాత బదిలీ అయిన ఉద్యోగుల జీతాల బిల్లులను ఖజానా శాఖ అనుమతించడం లేదు.
దీంతో ఉద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని… వారి బదిలీలను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఈ నెల 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలలో సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. ఈ నెల 16వ తేదీన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్ నెంబర్ 2 వద్ద ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం వైఎస్ జగన్.