గ్రూప్-2 పరీక్షలపై APPSC కీలక ప్రకటన

-

గ్రూప్-2 పరీక్షలపై APPSC కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 897 గ్రూప్-2 ఉద్యోగాలకు నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీపీఎస్సీ ఖండించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25వ తేదీనే ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేసింది.

APPSC Key Announcement on Group-2 Exams

సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది. సిలబస్ వివరాల కోసం https://psc.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించాలని తెలిపింది. కాగా, కొత్త ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ. 49,364 కోట్లు, తెలంగాణకు రూ. 25,639 కోట్లు రానున్నట్లు బడ్జెట్ లో వెళ్లడైంది. 2023-24 కంటే ఏపీకి రూ. 4,666 కోట్లు, తెలంగాణకు రూ. 2,423 కోట్లు ఎక్కువ మొత్తం అందనుంది. రాష్ట్ర విభజన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం కేంద్ర పన్నుల్లో ఏపీకి 4.047%, టీఎస్ కు 2.102% వాటాను కేంద్రం పంపిణీ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news