తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ ఇకపై తిరుమల కొండపై కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కీలక ప్రకటన చేశారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని వివరించారు.

ఒక్కో బస్సులో దాదాపు 50 మంది కూర్చుని ప్రయాణించవచ్చని ఈ సందర్భంగా కొనకల నారాయణరావు వెల్లడించడం జరిగింది. ఆసుపత్రులకు అలాగే పుణ్యక్షేత్రాలకు అటు చిరు ఉద్యోగాలు చేసే మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీంతో ఏపీలోని… మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మొదట కొండపైకి ఫ్రీ బస్సు సదుపాయం… తీసుకురాలేదు ఆర్టిసి. దీంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ఆర్టీసీ దిగివచ్చింది.