తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. నిన్నటి నుంచి తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. సెలవులు పూర్తయి స్కూల్స్ అన్ని రీఓపెన్ కావడంతో ఈ పరిస్థితి నెలకొంది అని అంటున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పట్టింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి నెలకొంది.

తిరుమల శ్రీవారి స్వామి దర్శనానికి 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఇక నిన్న ఒక్కరోజే 76,033 మంది తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 26,905 మంది తలనీలాలు సమర్పించడం జరిగింది. ఇక నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.30 కోట్లు వచ్చిందని టీటీడీ ప్రకటించింది.