ఓటీటీలోకి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రానుంది. ఈ తరుణంలోనే బిగ్ ట్విస్ట్ నెలకొంది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ‘హరిహర వీరమల్లు’ స్ట్రీమింగ్ కానుంది. నెల తిరగకుండానే ఓటీటీలోకి ‘హరిహర వీరమల్లు’ చిత్రం వస్తోంది.

ఓటీటీ స్ట్రీమింగ్‌లో కొన్ని సన్నివేశాలు తొలగించిన మూవీ టీమ్…. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వస్తోంది పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’.
కాగా సినిమా చివర్లో ‘యుద్ధ భూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్-2పై అంచనాలు పెంచేశారు.హైందవ ధర్మ పరిరక్షణ, కోహినూర్ ను దక్కించుకునే సమయంలో ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు HHMV పార్ట్-2 యుద్దభూమిలో ప్లాన్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.