దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వాసులకు శుభవార్త చెప్పింది. ఏపీఎస్ ఆర్టీసీ. దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించడమే కాదు.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయనున్నట్టు వెల్లడించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15వ తేదీ నుంచి 2,700 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు పేర్కొంది. ఈనెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అంటే ఏపీకి వెళ్లిన వారి తిరుగు ప్రయాణాల కోసం 2,800 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది.
ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా తిరుగుతాయని ఏపీఎస్ ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక బస్సులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు కూడా తిరుగుతాయని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మొత్తం 5500 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. స్థానికంగా జిల్లాల నుంచి విజయవాడకు 880 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనుంది ఏపీఎస్ ఆర్టీసీ. బస్సులకు సంబంధించిన సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా 0866-2570005 149 నెంబర్లు ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్పారు.