WORLD CUP 2023: రేపే వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ కళ్లన్నీ ఆ జట్లపైనే !

వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా రేపటి నుండి నవంబర్ 19వ తేదీ వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియాలోని మొత్తం పది వేదికల్లో మ్యాచ్ లు జరగనుండగా బీసీసీఐ చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. షెడ్యూల్ లో భాగంగా రేపు మధ్యాహ్నం 2 గంటలకు గుజరాత్ అహమ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ మరియు గత వరల్డ్ కప్ లో రన్నర్ అప్ గా నిలిచిన న్యూజిలాండ్ లో తలపడనున్నాయి. రెండు జట్లు అన్ని విభాగాలలోనూ సమతూకంగా ఉన్నాయి.. ఇక ఈ వరల్డ్ కప్ లో ఎవరు టైటిల్ ను ఎవరు గెలుచుకుంటారన్న విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది. కాగా ప్రస్తుతం జట్లు ఉన్న ఫామ్ ను బట్టి చూస్తే ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ లలో ఒకరు గెలిచే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు.

మరి వీరి అంచనాలు నిజం అవుతాయా ? ఇండియాలో వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.