జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం..మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి సన్నాహాలు

-

జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్య ఉత్పత్తుల డోర్ డెలివరీకి సన్నాహాలు చేస్తోంది జగన్‌ సర్కార్‌. ‘ఫిష్ ఆంధ్ర’ పేరుతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో 2వేల అవుట్ లైట్స్ ఏర్పాటు చేసి మత్స్య ఉత్పత్తులను విక్రయిస్తున్న ప్రభుత్వం… మరో అడుగు ముందుకు వేయనుంది.

ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉత్పత్తులను డోర్ డెలివరీ చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఫ్రెష్ చేపలు, రొయ్యలు, పీతలతో పాటు రెడీ టు కుక్ విధానంలో మారినేట్ ఉత్పత్తులను కూడా అందించనుంది. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోనుంది.

ఇది ఇలా ఉండగా, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచర్లకు ఇటీవల 23% జీతాలు పెంచిన ప్రభుత్వం ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని ప్రకటించింది. అయితే నిధులు కొరత కారణంగా మూడు నెలలు కోత విధించి, జూలై నుంచి అమలు చేస్తున్నట్టు KGBV కార్యదర్శి మధుసూదన రావు వెల్లడించారు. దీనివల్ల ఒక్కొ ప్రిన్సిపాల్ నెలకు రూ.6,384, టీచర్లు రూ. 5000 చొప్పున నష్టపోనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version