పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లాప్.. రెచ్చిపోయిన అంబటి

-

పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లాప్ అయిందని మరోసారి రెచ్చిపోయారు మంత్రి అంబటి రాంబాబు. రామ్మోహన్రావు జయంతోత్సవాల పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు అనంతరం మాట్లాడుతూ…పుంగనూరులో పోలీసులపై చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు చేసిన దాడి అమానుషమని.. ఘటన టిడిపి కార్యకర్తలకు పోలీసులకు మధ్య జరిగిందని వెల్లడించారు.

షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన రూట్ మ్యాప్ లో వెళితే ఏ సమస్య ఉండేది కాదని.. కావాలని శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చంద్రబాబు ప్రయత్నించారని తెలిపారు. తాను సింహాన్నని ప్రకటించుకున్నారు… తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది ….నక్క సింహంలా ఎలా మారుతుందో తెలియడంలేదంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా ఫ్లాప్…ఆయన రెమ్యూనరేషన్ ఎంతో చెప్పలేని వాడు రాజకీయాల్లో ఏం పారదర్శకత చూపిస్తాడని ఫైర్‌ అయ్యారు. నాపై మరో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు…అది విడుదలైన తర్వాత నేను ఓ సినిమా తీస్తానని ప్రకటించారు అంబటి రాంబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version