ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పారు. పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఏపీ టౌన్ షిప్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ [ఏపీ టిడ్కో] ఆధ్వర్యంలో.. నిర్మిస్తున్న గృహాలను రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల పేరితో.. రిజిస్ట్రేషన్లు చేయనుంది. ఈ ప్రక్రియను వెంటనే చేపట్టాలని.. ఆయా మున్సిపాటిటీల కమిషనర్లకు టిడ్కో ఎండీ ఆదేశాలు జారీ చేశారు.
సాధారణంగా.. మంగళ, శుక్ర వారాల్లో.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో.. రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు.. తక్కువగా ఉంటాయి. ఆ రోజుల్లో టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లయితే.. సర్వర్లపై భారం ఉండదని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా.. లబ్దిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను మినహాయిస్తూ… గత నెల 25 వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఫీజుల మొత్తం సుమారు రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్లు ఉంటుందని అంచనా… ఈ మొత్తాన్ని ప్రభుత్వామే భరించనుంది. దీంతోప్రజలకు భారం తప్పనుంది.