ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగున్నాయి. రేపు అధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. డీజీపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర కార్యదర్శులతో వేర్వేరుగా భేటీ కానున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శులతో అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ సమావేశం ఉండనుంది.
శాసనసభ సమావేశాల భద్రత, నిర్వహణ తదితర అంశాలపై సమీక్షించనున్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఇది ఇలా ఉండగా, శ్వేతపత్రాల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక, ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయనున్నారు. కాగా, ఇప్పటివరకు నాలుగు శ్వేతపత్రాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.