సీఐడీ కస్టడికి చంద్రబాబు.. ఆ సమయంలో నే విచారణ చేపట్టాలి : జడ్జీ

-

చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిపోయి తాజాగా తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. బుధవారం సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తరఫున సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే లు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఆరోజు ఈ తీర్పుపై మాత్రం ఏసీబీ కోర్టు రిజర్వు చేశారు. ఈ కేసులో చంద్రబాబు 5 రోజుల కస్టడీని కోరింది ఏపీ సీఐడీ.

CC
CC

తాజాగా ఏసీబీ కోర్టు ఈ తీర్పు వెల్లడించింది. 2 రోజుల పాటు కస్టడికి సీఐడీ విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు.. రాజమండ్రి సెంట్రల్ జైలులోనే విచారణ చేపడుతామని సీఐడీ జడ్జీకి చెప్పారు. మరోవైపు ఉదయం 9.30 గంటలకు సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలి. రేపు, ఎల్లుండి రెండు రోజులు పాటు విచారణ జరిపి.. విచారణ వీడియో బయటికీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరూ న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జీ చెప్పారు. విచారణ నివేదికను సీల్డ్ కవరులో మాత్రమే పంపించాలని ఆదేశించారు ఏసీబీ కోర్టు జడ్జీ. మరోవైపు బెయిల్ పిటిషన్ పై రేపు చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తామని జడ్జీని కోరగా.. సోమవారం మాత్రమే వాదనలు వింటామని జడ్జీ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news