ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ సంచలన వ్యాఖ్యలు

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెంలో పలు అభి కార్యక్రమాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం అసెంబ్లీ స్థానం మహిళా రిజర్వేషన్ అయితే తనకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయేమోనని పేర్కొన్నారు. ఒకవేళ ఖమ్మం స్థానం నుంచి మహిళలకు రిజర్వ్ అయితే.. తమ ఇంట్లో నుంచి ఎవ్వరినీ నిలబెట్టనని పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన మహిళలు మాత్రమే పోటీలో ఉంటారని స్పస్టం చేశారు. మహిళల కోసం మనమంతా ముందుండాలని.. కేటీఆర్ చెప్పినట్టు తన స్థానం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. అయితే తాను ప్రజల మధ్యనే ఉంటూ.. వారికి సేవ చేయడాన్ని మాత్రం వదిలిపెట్టేది లేదన్నారు.


ఖమ్మం నియోజకవర్గాన్ని ఖమ్మంజిల్లాను వదిలిపెట్టేది లేదన్నారు. ఎవ్వరో వచ్చి దండాలు పెట్టి.. మళ్లీ మాయమైపోతారనిపేర్కొన్నారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని తెలిపారు. ఖమ్మం అభివృద్దిని సాదుకోవాలో చంపుకోవాలి మీరే డిసైడ్ చేయండి అన్నారు. గతంలో ఇక్కడ గెలిపించిన ఎవ్వరైనా సరే రెండో సారి ఖమ్మంలో ఉండే ప్రయత్నం చేయలేదు.
ఎవరినీ గెలిపించినా అటు ఇటో చూసి పారిపోయారు. కానీ తాను మాత్రం ఇక్కడే ఉన్నానని పేర్కొన్నారు.