సీఎం జగన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. బపెన్షన్లపై ఇంకెన్నాళ్లీ అబద్దాల ప్రచారమని.. అబద్దాల పునాదులపై ఎల్లకాలం బతకలేరని జగన్ రెడ్డి గుర్తించాలని ఫైర్ అయ్యారు. రూ.3వేల హామీపై మాట తప్పి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టారు….నిజం చెబితే తల వేయిముక్కలవుతుందనే శాపం సీఎం జగన్ రెడ్డిని వేధిస్తోందని చురకలు అంటించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
రూ.3వేలు పెన్షన్ హామీపై అధికారంలోకి రాగానే మాట తప్పారు…ప్రమాణ స్వీకారంలో ఇచ్చిన హామీనీ తుంగలో తొక్కారని ఆగ్రహించారు. మాట తప్పి మడమ తిప్పి ఒక్కొక్కరికి రూ.30వేలు ఎగనామం పెట్టారని తెలిపారు. ఇప్పుడు పెన్షన్ దారులకు లేఖలోనూ పచ్చి అబద్దాలు సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.
చంద్రబాబు రూ.200 పెన్షన్ రూ.1800 పెంచి రూ.2000 చేశారని.. చంద్రన్న ఐదేళ్లలో కొత్తగా 20 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేశారన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్లలో పెంచింది రూ.750 మాత్రమేనని…లబ్దిదారులు 10 లక్షలు మాత్రమేనని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.