జపాన్‌ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి

-

జపాన్‌లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం రోజున దాదాపు 21 సార్లు భూమి కంపించడంతో ఆ దేశ పశ్చిమ ప్రాంతం అల్లకల్లోలం అయింది. ఈ భూకంప ధాటికి ఆరుగురు మరణించారు. పలువురు గాయపడ్డారు. కొంత మంది శిథిలాల కింద చిక్కినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు భూకంపాలతో అధికారులు భారీ సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతంలోని ప్రజలంతా ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చి ఆ తరువాత సునామీ హెచ్చరికల తీవ్రతను తగ్గించింది.

మరోవైపు జపాన్ భూకంపాల ఘటనపై టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జపాన్‌లో షూటింగ్ ముగించుకొని సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్ వచ్చారు. జపాన్‌లో వారం రోజులు ‘దేవర’ షూటింగ్లో పాల్గొన్నారు. ఈ సినిమా చిత్రీకరించిన ప్రాంతంలో భూకంపం రావడం తన హృదయాన్ని కలిచివేసిందని.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ తారక్‌ ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news