ఏపీ లో ఈ మధ్య కాలంలో దారుణాలు విపరీతంగా జరుగుతున్నాయి. అయితే.. తాజాగా అనకాపల్లిలో దారుణం. చోటు చేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి రేప్ చేశారు. ఇప్పుడు ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
అనకాపల్లి పట్టణానికి చెందిన 19 సంవత్సరాలు యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు అనకాపల్లికి చెందిన యువకుడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్ లో అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ తరుణంలోనే తన కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. దీంతో… కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడిన తేజ సాయికుమార్, తో పాటు ఇతనికి సహకరించిన మరో ఐదుగురిని అరెస్టు చేశారు అనకాపల్లి పట్టణ పోలీసులు. ఈ శుక్రవారం ఈ ఘటన జరుగగా.. ఆలస్యంగా వెలుగులోకి…వచ్చింది.