ఎంపీడీవో పై దాడి.. నిందితులకు రిమాండ్

-

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో పై దాడి కేసులో వైసీపీ నేత సుదర్శన్ రెడ్డికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆయనతో పాటు ఇతర నిందితులు భయ్యారెడ్డి, వెంకట రెడ్డికి కూడా రిమాండ్ విధించారు. వీరు ముగ్గురినీ కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పరారీలో  ఉన్న మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అటు కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న జవహర్  బాబును ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు.

అదేవిధంగా  అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించారు. నిన్న జరిగిన ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి ఘటన పై ఆరా తీశారు. అలాగే విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు భరోసా ఇవ్వాలని ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు పవన్ ను కోరారు. ఉద్యోగులపై దాడులు చేస్తే.. తీవ్ర చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news