వైద్యారోగ్య శాఖ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. ఇకపై 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్ ఉండనున్నారు. 190 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది, డ్రైవర్లకు అదనంగా ఇకపై 4వేలు ఇవ్వనున్నారు. అందుబాటులోకి కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలు రానున్నాయి. ప్రతీ మండలంలో జన ఔషది స్టోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రివెంటివ్ హెల్త్ కేర్ కు ప్రాధాన్యం ఇచ్చేలా వైద్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా వైద్య శాఖలో పెండింగ్ లో ఉన్న సమస్యలు తీసుకురానున్న సంస్కరణలపై చర్చించారు. మంత్రి సత్యకుమార్ తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.