1000 మెట్రిక్ టన్నుల గంధపు చెట్లను వేలం వేస్తున్నామని ప్రకటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ గుంటూరులో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ….అడవుల్లో మృగాలను వేటాడే వారికి ,గంధపు చెక్కలు స్మగ్లింగ్ చేసే వారి పై ప్రతిని చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. రాబోయే నెలలో, వెయ్యి మెట్రిక్ టన్నుల గంధపు చెట్లను, వేలం వేయబోతున్నామని తెలిపారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ సంస్థ అయినా ఈ వేలంలో పాల్గొనవచ్చు అన్నారు.
ఓవర్ గా మాట్లాడితే..జగన్, వైసీపీ నేతలపై కేసులు పెడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మాది మంచి ప్రభుత్వమే కానీ , మెతక ప్రభుత్వం కాదన్నారు. ఐపీఎస్ అధికారులపై జగన్ బెదిరింపులు ఆపకపోతే, కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యాఖ్యలను, సుమోటోగా తీసుకొని కేసులు పెడతామని హెచ్చరించారు. మహిళల సంరక్షణ ,మా మొదటి ప్రాధాన్యత దానికోసం ,ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై దాడులు అరికట్టడానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ అవసరం అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. స్కూల్ ఏజ్ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు, మార్షల్ ఆర్ట్స్ నేర్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.