అయ్యన్నపాత్రుడు అంటే అందరి పాత్రుడని మంత్రి నారా లోకేష్ అన్నారు. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక అనంతరం శాసనసభలో లోకేష్ మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అయ్యన్నపాత్రుడని కొనియాడారు. 25 ఏళ్ల వయసులో మంత్రిగా ఎన్నికయ్యారన్నారు. 16 ఏళ్లు మంత్రిగా పని చేసిన అనుభవం అయ్యన్నపాత్రుడికి ఉందన్నారు. ఒకే పార్టీ.. ఒకే జెండా.. ప్రజల అజెండాగా ముందుకెళ్లిన నాయకుడు అయ్యన్నపాత్రుడని పేర్కొన్నారు. అయ్యన్న పాత్రుడిపై గత వైసీపీ ప్రభుత్వం కక్షకట్టిందని నారా లోకేష్ తెలిపారు.
స్పీకర్ అయ్యన్న పాత్రుడితో కలిసి పని చేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి నారా లోకేష్ అన్నారు. వైసీపీ హయాంలో కక్ష గట్టి అయ్యన్న ఇంటిని కూలగొట్టినా, కేసులు పెట్టినా తగ్గకుండా పోరాడారని కొనియాడారు. ఒకే పార్టీ, ప్రజలే అజెండాగా అయ్యన్న ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో సభను గౌరవ ప్రదంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. స్వపక్షమే ప్రతిపక్షంలా మారి ప్రజల సమస్యలపై చర్చిస్తామన్నారు.