బాలికలపై బాబు ప్రేమ: శీను మాయ… బడికొస్తా!

-

బాబు మైకందుకుంటే చాలు.. బీసీలు, ఎస్సీల్ వైపే టీడీపీ ఉంటుంది.. వారి అభివృద్ధే మాకు ప్రధానం అంటూ చెప్పుకొస్తుంటారు. విచిత్రం ఏమిటంటే.. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ బాబు & కో అన్యాయం చేసింది వారికే.. అవినీతి చేసింది వారి సొమ్ముతోనే! నిన్న ఈఎస్ ఐ స్కాం లో కార్మికుల సొమ్ము అవినితిపరుల పాలైందంటూ జరుగుతున్న కేసులో కూడా పరోక్షంగా మెజారిటీగా బాబు వల్ల అన్యాయం అయిపోయింది బడుగు బలహీన వర్గాలే!

ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిల్లు పంపిణీ చేసే విషయంలో అవినీతి జరిగిందంటూ వస్తున్న వార్తల్లో కూడా ఇబ్బందులు పడింది, అన్యాయం అయ్యింది వారే కదా అనే విమర్శలు మొదలైపోయాయి! సాయిరెడ్డి చెబుతున్న మాటల్లో వాస్తవం ఉండి ఉంటే మాత్రం… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలపై బాబుకున్న ప్రేమ అలాంటిదన్న మాట అనే కామెంట్లకు ఆస్కారం ఉన్నట్లే!

తాజాగా ఈ విషయాలపై స్పందించారు విజయసాయి రెడ్డి! టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో “బడికొస్తా” పథకం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో అవినీతి జరిగిందని ఇప్పటికే ఒక ట్వీటేసిన సాయిరెడ్డి… తాజాగా మరోసారి స్పందించారు. “బడికొస్తా పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల ‘గంట’లు ఎందుకు మూగబోయాయో ‘శీను మాయ’ తెలియాల్సి ఉంది” అని మరో ట్వీట్ చేశారు!

ఈ వ్యవహారంపై వరుస ట్వీట్లు చూస్తుంటే… “నెక్స్ట్ గంటా”నే అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ఢిల్లీ వెళ్లిన టీడీపీ ఎంపీలపై కూడా సాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు.”రాష్ట్రపతికి కంప్లైంట్ల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టారు. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు.. అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అంట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి” అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు!

Read more RELATED
Recommended to you

Latest news