బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో.. హెరిటేజ్ జ్యూసో అనుకుంటున్నారా?.. చంద్రబాబుకు బొత్స కౌంటర్

-

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. తన నియోజకవర్గానికి వెళ్ళి తాను ఒక పనికిమాలిన వ్యక్తి అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు అని మండిపడ్డారు. పనికిమాలిన తనానికి పేటెంట్ హక్కు చంద్రబాబుదే అని చెప్పారు. బైజూస్ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని బొత్స చెప్పారు.

బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో.. హెరిటేజ్ జూసో అనుకుంటున్నారా? అని ఎద్దేవా చేశారు. బైజూస్ అంటే ఏమిటో మీ మనవడిని అడిగితే చెబుతారు అని అన్నారు. మమ్మీ, డాడీ అని పిలవడం కోసం ఇంగ్లీష్ మీడియం అని చంద్రబాబు అంటున్నారని.. అందుకేనా మీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించారు? అందుకేనా విదేశాలకు పంపించింది? అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయి మాట్లాడారని అన్నారు. పేద పిల్లలకు కూడా అంతర్జాతీయ కంటెంట్ అందుబాటులో ఉండాలనే ఏపీ ప్రభుత్వం బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version