23 ఏళ్లకే 23 ఉద్యోగాలు చేసిన యువతి.. ఇప్పుడు ఏకంగా ఆ స్థాయికి.!

-

ఈ రోజుల్లో ఒక్క జాబ్‌ వేతుక్కోవడానేకి నానా తంటాలు పడుతున్నాం.. జాబ్‌కు తగిన క్వాలిఫికేషన్స్‌ అన్నీ ఉన్నా.. కొన్ని సార్లు మనకు ఆ జాబ్‌ రాదు. చాలామంది.. ఏదైనా జాబ్‌లో జాయిన్‌ అయితే అంత త్వరగా మారరు.. అక్కడే సంవత్సరాల తరబడి ఉండిపోతారు. దీనికి కారణం.. ఆ జాబ్‌లో ప్రజర్‌ లేకపోవడం, ట్రావెలింగ్‌కి ఇబ్బంది లేకపోవడం, టైమింగ్స్ సెట్‌ అవడం ఇలా ఏవేవో ఉంటాయి.. వీటన్నిటి ముందు కాస్త శాలరీ అటూ ఇటుగా ఉన్నా పెద్ద ఫరక్‌ పడరు. కానీ ఈ అమ్మాయి మాత్రం 23 ఏళ్లకే 23 జాబ్‌లు చేసింది.. అంటే.. జాయిన్‌ అయిన ప్రతీ కంపెనీలో పర్ఫామెన్స్‌ బాలేక పీకేసారునుకంటారేమో.. నెంబర్‌ వన్‌ టాలెంట్‌.. చేసిన ప్రతి జాబ్‌లో తనదైన శైలీలో ముందుకెళ్లింది.. ఫైనల్‌గా ఇప్పుడు ఓ పెద్ద స్థాయికి ఎదిగింది.. ఈ యువతి ముచ్చటేందో.. మనమూ చూద్దామా!
యూఎస్‌లో ఒక యువతి అతిచిన్న వయసులోనే అనేక రంగాలలో తన ట్యాలెంట్‌ను ప్రూవ్‌ చేసుకుంది. ఒక ఉద్యోగం చేస్తునే ప్రతిసారి దానికన్నా బెటర్ మెంట్ ఉద్యోగం కోసం ట్రై చేస్తు ఉండేది. లండన్‌కు చెందిన అనస్తాసియా సెచెట్టోకు 23 ఏళ్లు. ఆమె ప్రస్తుతం 23 ఉద్యోగాలను చేసింది. చేసిన ప్రతి ఉద్యోగంలోను తనకంటూ మంచి గుర్తింపును సంపాదించింది. ఆమె రష్యా, ఇటాలియన్, ఇంగ్లీష్, డచ్ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడుతుంది. అనస్తానియా.. మొదట.. బేకరీలో జాబ్‌తో తన కెరియర్ ప్రారంభించింది.

డిష్‌ వాష్‌ నుంచి మొదలు..మోడలింగ్‌ వరకూ..

డిష్ వాషర్, వెయిటర్, క్యాషియర్, సేల్స్ వర్కర్, పియానో టీచర్, మార్కెట్ సెల్లర్, ఈవెంట్ ఆర్గనైజర్, రిటైల్ వర్కర్, నటన, మోడలింగ్ రంగాలలో పనిచేసింది. అదే విధంగా.. బేబీ సిట్టింగ్, అనువాదకురాలిగా, ఫోటొగ్రఫి వర్కర్‌గా, కంటెంట్ రైటర్ గా, ఎస్ఈవో స్పెషలిస్ట్, ఫ్రీలాన్సర్ సోషల్ మీడియా మెనేజర్‌గా, ఆన్ లైన్ పర్సనల్ ట్రైనర్‌గా, లగ్జరీ హోటల్‌కి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేసింది. జీరో నుంచి హోరో వరకూ అంటే ఇదేనేమో..!
చేసిన ప్రతి ఉద్యోగంలో తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది. అన్ని ఉద్యోగాలలో అనేక అనుభవాలను ఎదుర్కొంది. చివరకు సొంతంగా మార్కెటింగ్ ఏజెన్సీ స్థాపించి దానికి సీఈవో అయ్యింది. ప్రస్తుతం ఈ లండన్ అమ్మాయి.. అనస్తాసియా సెచెట్టో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. డిష్‌ వాషర్‌ స్థాయి నుంచి.. సీఈవో వరకూ ఎదిగిందంటే.. ఆమెకు సలాం కొట్టాల్సిందే..!
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version