శ్రీశైలం ఎమ్మెల్యే, పాణ్యం ఎమ్మెల్యేలకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్నింగ్

-

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షం కంటే ఎక్కువ ఇబ్బందులు పడ్డానని ఈ సందర్భంగా వెల్లడించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. పార్టీ కోసం కష్టపడింది నేను, ఎమ్మెల్యేగా గెలిపించింది నేనేనని.. మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే పెత్తనం ఏంటి అని ప్రశ్నించారు.

Byreddy Siddharth Reddy

వైసీపీ కార్యకర్తలను కాదని టిడిపి వాళ్ళతో కలసి రాజకీయం చేయడం మగతనమా అని ఫైర్‌ అయ్యారు. నేను తలుచుకుంటే మీ నియోజకవర్గాలలోకి నేను వస్తే, మీకు డిపాజిట్లు కూడా రావని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారైనా తన కష్టాన్ని గుర్తించండి జగన్ సార్….వైసిపి మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉంది, టిడిపి మేనిఫెస్టో నమ్మే పరిస్థితి లేదని వివరించారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news