రోజాపై వ్యాఖ్యలు..బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ ?

-

విశాఖ జిల్లాలోని పరవాడ (మం) వెన్నెలపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు.. బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణపై కేసు నమోదు చేశారు పోలీసులు.

Bandaru Satyanarayana Murthy arrested

ఏపీ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు ఆధారంగా గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణపై కేసు నమోదు అయింది. క్రైమ్ నంబర్ 354/2023 u/s 354.153a 504 505 506.509 IPC and 67 of IT Act కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అన్ని 7 సంవత్సరాల లోపు శిక్షకు చెందిన సెక్షన్ లు కావడంతో పోలీసు యాక్షన్ పై సస్పెన్స్ నెలకొంది. నోటీస్ ఇచ్చి విచారణ పిలుస్తారా…? లేక అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అనే సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం అయితే…టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్య నారాయణ ఇంటికి భారీగా పోలీసులు వచ్చారు. మరికాసేపట్లోనే అరెస్ట్‌ చేసే ఛాన్స్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version