తిరుమల శ్రీవారి సేవలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

-

తిరుమల శ్రీవారిని కేంద్రమంత్రి బండి సంజయ్‌ దర్శించుకున్నారు. పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇక తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారని బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని తెలిపారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపద దోచుకున్నారని ఆరోపించారు. ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

‘గత ప్రభుత్వంలో ఏపీలో ఎర్రచందనం దోపిడీతో సర్కార్కే అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు. శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతాం. నాస్తికులకు, అన్యమతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు. నివేదిక ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ఏడుకొండలను రెండు కొండలుగా మార్చాలనుకున్న అన్యమత పాలన పోయింది. అన్యమత పాలనపోయి గోవిందుడి పాలన వచ్చింది.’ అని బండి సంజయ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news