మిచౌంగ్ తుఫాన్ కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేత

-

Cyclone Michaung : మిచౌంగ్ తుఫాన్ కారణంగా విశాఖలో బీచ్‌లు మూసివేశారు. అంతేకాదు ఆర్కే బీచ్‌లో పోలీసుల ప్రత్యేక పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని బీచ్‌ల వద్ద పోలీసుల పర్యవేక్షణ కొనసాగుతోంది. పర్యాటకులు బీచ్‌లోకి దిగకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇక అటు పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Beaches in Visakhapatnam remain closed due to Cyclone Michoung

బంగాళా ఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద పర్యటనకు వెళ్లే మొత్తం బోట్లు నిలిపివేశారు. పోశమ్మ గండి వద్ద ఏపీటీడీసీ బోటుతోపాటు మొత్తం 15 బోట్లను నిలిపివేశామని ఈ మేరకు కంట్రోల్ రూమ్ సూపర్వైజర్ పి నాగరాజు ప్రకటించారు. తుఫాన్ తగ్గిన అనంతరం అనుమతులు ఇస్తామని వెల్లడించారు. అప్పటి వరకు పర్యాటకులు ఓపిక పట్టాలని కూడా కోరారు కంట్రోల్ రూమ్ సూపర్వైజర్ పి నాగరాజు.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version